* బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ఆకేరున్యూస్, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం హిల్డ్ పాలసీ పేరుతో రూ.5 లక్షల కోట్ల భారీ భూమి కుంభకోణానికి పాల్పడుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. పరిశ్రమలు వద్దు అంటూ అపార్ట్మెంట్లు, విల్లాలు, కమర్షియల్ కాంప్లెక్సులు కట్టుకోమని పారిశ్రామిక భూములను ఇస్తుందని ధ్వజమెత్తారు. పారిశ్రామిక భూముల బదలాయింపుపై కేటీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ నిజనిర్ధారణ బృందం జీడిమెట్ల ఇండస్ట్రియల్ పార్క్లో పర్యటించింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం చెబుతున్నట్లు అవి ప్రైవేటు వ్యక్తుల భూములు కావని, ప్రైవేట్ వ్యక్తులకు ప్రజలు, ప్రభుత్వం ఇచ్చిన భూములన్నారు. అందులో కేవలం పరిశ్రమలు పెట్టి ఉపాధి కల్పించాలన్న నిబంధనలతోనే ఆ భూములను ఇచ్చారని గుర్తుచేశారు. మార్కెట్లో గజం ధర లక్షన్నర రూపాయలు పలుకుతుంటే ప్రభుత్వం మాత్రం కేవలం రూ.4000కు ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్తున్నదని విమర్శించారు.
…………………………………………………………
