ఆకేరు న్యూస్,డెస్క్:విజయవాడ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (GGH)లో విషాదం చోటుచేసుకుంది. ఎనస్థీషియా విభాగంలో పీజీ చదువుతున్న డాక్టర్ బత్తుల దీపిక బుధవారం అర్ధరాత్రి ఆపరేషన్ థియేటర్లోనే అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయారు. బుధవారం రాత్రి 1:10 గంటల వరకు దీపిక విధుల్లో చురుగ్గా ఉన్నట్లు సమాచారం.అరగంట వ్యవధిలోనే (1:40 గంటలకు) ఆమె ఆపరేషన్ థియేటర్లో అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని తోటి విద్యార్థులు గమనించారు.వెంటనే అత్యవసర చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఆరోగ్యంగా ఉన్న విద్యార్థిని అకస్మాత్తుగా మరణించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.మరణానికి గల కారణాలపై స్పష్టత రావాల్సి ఉంది.
……………………………..
