ఆకేరున్యూస్ డెస్క్ : ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అయోధ్య శ్రీరాముని మందిరాన్ని సందర్శించి, బాలరాముడిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సీఎం ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామ మందిర దర్శనం తనకు ఎంతో ప్రశాంతతను, ఆధ్యాత్మిక శక్తిని ఇచ్చిందని, ఈ పవిత్ర క్షేత్రాన్ని మరోసారి సందర్శించడం తన అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. భగవాన్ శ్రీరాముడు చూపిన ధర్మం, విలువలు, ఆదర్శాలు ఎప్పటికీ కాలాతీతమైనవని, అవి సమాజానికి నిరంతరం మార్గదర్శకంగా నిలుస్తాయని చంద్రబాబు కొనియాడారు. శ్రీరాముడి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని, శ్రీరాముడి ఆదర్శాలు మనందరిలో స్ఫూర్తిని నింపాలని ఆకాంక్షించారు.
……………………………..

