ఆకేరు న్యూస్,డెస్క్:ప్రేమ పెళ్లి చేసుకుందని కన్నకూతురు బతికుండగానే ఆమెకు కర్మక్రియలు నిర్వహించిన హృదయ విదారక ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది.చిత్తూరు జిల్లా పిళ్లారికుప్పం గ్రామానికి చెందిన హేమప్రియ అనే యువతి, అదే గ్రామానికి చెందిన కిశోర్ అనే యువకుడిని ప్రేమించింది. పెద్దలను ఎదిరించి, తన ప్రేమను గెలిపించుకోవాలని భావించిన హేమప్రియ, తల్లిదండ్రుల మాట వినకుండా కిశోర్‌ను వివాహం చేసుకుంది.తమ ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకుందన్న కోపంతో ఆ తల్లిదండ్రులు అమానవీయ నిర్ణయం తీసుకున్నారు. తమ కుమార్తె తమకు చనిపోయిందని భావిస్తూహేమప్రియ ఫోటోకు పూలమాల వేశారు. హిందూ సంప్రదాయం ప్రకారం మనిషి చనిపోతే చేసే కర్మక్రియలను నిర్వహించారు. గ్రామం నడిబొడ్డున అందరూ చూస్తుండగానే ఆమెకు ‘పిండప్రదానం’ చేసి, తమకు ఆమెతో ఉన్న బంధం తెగిపోయిందని ప్రకటించారు.ఈ ఘటన సోషల్ మీడియాలో కూడా వైరల్‌గా మారింది. ఈ ఘటన గ్రామంలో తీవ్ర కలకలం రేపింది.
…………………………………………
