AP High Court Judges
* ఏపీ హైకోర్టుకు శాశ్వత న్యాయమూర్తులుగా ఐదుగురు
ఆకేరు న్యూస్, అమరావతి : ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా ఉన్న ఐదుగురు జడ్జీలు శాశ్వత న్యాయమూర్తులుగా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. జస్టిస్ కుంచం మహేశ్వరరావు, జస్టిస్ తూట చంద్ర ధనశేఖర్ (టీసీడీ శేఖర్), జస్టిస్ చల్లా గుణరంజన్, జస్టిస్ అవధానం హరిహరనాథ శర్మ, జస్టిస్ డాక్టర్ యడవల్లి లక్ష్మణరావు శాశ్వత న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
* కోర్టు హాల్లో..
అమరావతిలోని హైకోర్టు మొదటి కోర్టు హాలులో సోమవారం జరిగిన ఫుల్ బెంచ్ కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ వీరిచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ఐదుగురు అదనపు న్యాయమూర్తులను శాశ్వత న్యాయమూర్తులుగా నియమించడానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలిపిన అనంతరం కేంద్ర న్యాయశాఖ అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది.
* న్యాయమూర్తులకు శుభాకాంక్షలు
ఈ ప్రమాణస్వీకార మహోత్సవంలో హైకోర్టు న్యాయమూర్తులు, బార్ కౌన్సిల్ ప్రతినిధులు, హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ సభ్యులు, సీనియర్ న్యాయవాదులు, రిజిస్ట్రార్లు మరియు న్యాయశాఖ అధికారులు పాల్గొని నూతన శాశ్వత న్యాయమూర్తులకు శుభాకాంక్షలు తెలిపారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
