
* తెలంగాణలో బయటపడ్డ “కోట్ల” కట్టలు
* అట్టపెట్టెల్లో కోట్ల రూపాయలు
* ఎవరా పెద్ద తలకాయ?
ఆకేరు న్యూస్, అమరావతి : ఆంధ్రప్రదేశ్(Andhrapradesh)లో గత ప్రభుత్వంలో జరిగిన లిక్కర్ స్కామ్‌కు సంబంధించి అధికారులు విచారణను వేగవంతం చేశారు. ఈ కేసు కీలక మలుపు తిరిగింది. తెలంగాణ(Telangana)తో కూడా దీనికి లింకులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ రోజు పలు చోట్ల దాడులు నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కాచారంలో ఉన్న సులోచన ఫామ్ హౌస్(Sulochana FormHouse) లో సోదాలు చేపట్టగా అధిక మొత్తంలో నగదు బయటపడింది. రూ.11 కోట్లను అధికారులు సీజ్ చేశారు. A40 వరుణ్ ఇచ్చిన సమాచారంతో సిట్ దాడులు నిర్వహించింది. ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన బాలాజీ గోవిందప్ప డైరెక్టర్‌గా ఉన్న భారతి సిమెంట్స్‌లో తనిఖీలు చేశారు. అటు A1 కేసిరెడ్డికి చెందిన రీసోర్స్ వన్ కంపెనీలో కూడా సిట్ అధికారులు సోదాలు చేశారు. మరో నిందితుడు చాణక్యకు చెందిన టీ గ్రిల్ రెస్టారెంట్‌ను కూడా అనువణువు పరిశీలించారు. ఏపీ లిక్కర్ స్కాం భారతి సిమెంట్స్ (Barathi Ciments)కేంద్రంగా నడిచిందని అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో రంగారెడ్డి జిల్లా కాచారంలో రూ.11 కోట్ల నగదు పట్టుబడటం సంచలనంగా మారింది. ఈకేసులో వరుణ్ మరో సంచలన విషయం అధికారులకు చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ముడిపడి ఉన్న ఓ పెద్ద మనిషి గురించి చెప్పినట్లు సమాచారం. ఆయన గురించి వరుణ్ చెప్పింది నిజమేనా అని అధికారులు విచారణ చేపడుతున్నట్లు సమాచారం.
………………………………………….