* ఈనెల 29 వరకు ఆన్లైన్లో స్వీకరణ
* డిసెంబర్ 27 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్
* సర్వీస్ ఉపాధ్యాయులకూ.. తప్పని సరి
* ఐదేండ్లలోపు ఉన్న వారికి మినహాయింపు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : నేటి నుంచి టెట్ దరకాస్తులు స్వీకరించనున్నారు. శనివారం నుంచి ఫీజు చెల్లింపు, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభంకానుంది. ఈ నెల 29 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. డిసెంబర్ 27 నుంచి హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకునేందుకు వీలు కల్పించారు. 20 26 జనవరి 3 నుంచి 31 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఒక పేపర్‌కు 750, రెండు పేపర్లకు రూ. వెయ్యి ఆన్లైన్లో ఫీజుగా నిర్ణయించారు. గతం లో 2010కి ముందు రిక్రూట్ అయి న టీచర్లకు టెట్ అర్హత నుంచి మినహాయింపు ఇచ్చారు. ఇప్పుడు సు ప్రీంకోర్టు తీర్పు మేరకు అందరికి టెట్ అర్హత తప్పనిసరి అయ్యింది. ప్రస్తుతం పనిచేస్తున్న వారు రెండేండ్లలోపు టెట్‌లో పాస్ కావాలి. ఐదేం డ్ల లోపు సర్వీస్ ఉన్న వారికి మినహాయింపు ఇచ్చింది. టెట్ లేకపోతే ఉ ద్యోగం కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది. దీంతో 2010కి ముందు రిక్రూట్ అయిన వారు టెట్రాసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దరఖాస్తు సహా పూర్తి వివరాల కోసం https://schoo ledu.telanga na.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు. సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ తప్పనిసరితో ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు.
…………………………………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
