
ఆకేరున్యూస్: వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన వారికి ప్రధానం చేసే దేశంలోనే అత్యున్నత పురస్కారం ‘పద్మ’ అవార్డ్స్ కోసం కేంద్ర ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది. గణతంత్ర వేడుకల సందర్భంగా ప్రకటించే 2026 సంవత్సరానికి సంబంధించిన పద్మ అవార్డుల కోసం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభించింది. ఆసక్తి ఉన్నవారు జులై 31 లోగా పద్మ అవార్డులకు సంబంధించిన నామినేషన్లు, సిఫార్సులు రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్ https://awards.gov.in లో అప్లోడ్ చేయాలని కేంద్ర ప్రభుత్వం వెల్లడిరచింది.
……………………….