
* ఎన్టీఆర్ భరోసా పింఛన్లకు రూ. 27,518 కోట్లు
* తల్లికి వందనం పథకానికి రూ. 9,407 కోట్లు
* అమరావతికి రూ.6వేల కోట్లు
ఆకేరు న్యూస్, అమరావతి : అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలలకు ఏపీ ప్రభుత్వం శుక్రవారం అసెంబ్లీలో పూర్తిస్థాయి బడ్జెట్ (Budjet) ప్రవేశపెట్టింది. గత ప్రభుత్వంలో ఆర్థిక విధ్వంసం జరిగిందంటూ ఆ దాడిని హిరోషిమాపై జరిగిన అణుదాగిగా అభివర్ణించారు. అణుదాడిలో విధ్వంసమైన హిరోషిమా లేచి నిలబడగా లేనిది.. ఆర్థిక విధ్వంసం జరిగిన ఆంధ్రప్రదేశ్‌ను తిరిగి నిలబెట్టలేమా అంటూ ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ (Payyavula Kesav) వార్షిక బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. సంక్షేమం, అభివృద్ధికి బడ్జెట్ కేటాయింపుల్లో ప్రాధాన్యం ఇచ్చారు. ప్రధానంగా అధికారంలోకొచ్చేందుకు దోహదపడ్డ సూపర్ సిక్స్ లోని కొన్ని పథకాలకు బడ్జెట్లో కేటాయింపులు చేపట్టారు. 3 లక్షలా 22 వేల 359 కోట్లతో 2025 26 వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు. వ్యవసాయానికి 48 వేల కోట్ల బడ్జెట్, పాఠశాల విద్యాశాఖ 31 వేల ఎనిమిది వందల ఆరు కోట్ల బడ్జెట్‌ను కేటాయించారు. బీసీ సంక్షేమం కోసం 23,260 కోట్లు, వైద్యరోగ్య శాఖకు 19,265 కోట్లు, పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధికి 18,848 కోట్లు, జలవనరుల శాఖకు 18 ఇరవై కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. పురపాలక శాఖకు 13,862 కోట్లు, ఇంధన శాఖకు రూ 13,600 కోట్లు, వ్యవసాయ శాఖకు 11,636 కోట్లు, సాంఘిక సంక్షేమానికి 10,909 కోట్లు, ఆర్థికంగా వెనుకబడిన సంక్షేమానికి 10,619 కోట్లు, రవాణా శాఖకు 8785 కోట్లు కేటాయించారు.
అమరావతికి రూ.6వేల కోట్లు
రాజధాని అమరావతి (Amaravathi) నిర్మాణానికి ఆరువేల కోట్ల రూపాయలను ప్రతిపాదించారు. ఇవన్నీ బయటనుంచి వచ్చేనిధులు అనీ, రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అమరావతికి నిధులు కేటాయించడం లేదని పయ్యావుల కేశవ్ చెప్పారు. ఇక పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి 6,705 కోట్లను, సాగునీటి ప్రాజెక్టులకు 11,314 కోట్లను కేటాయించారు.
బడ్జెట్లు కేటాయింపులు ఇలా.. (రూ.కోట్లలో)
* ఎన్టీఆర్ భరోసా పింఛన్లకు 27,518
* తల్లికి వందనం పథకానికి 9,407
* దీపం 2.0 పథకానికి 2,601
* తల్లికి వందనం కోసం 9,407
* పౌరసరఫరాల శాఖకు 3,806
వ్యవసాయ అనుబంధ రంగాలకు 13,487
జల్ జీవన్ మిషన్ కు 2,800
మద్యం, మాదకద్రవ్యాల రహిత రాష్ట్రం కోసం నవోదయ 2.0 కార్యక్రమానికి 10
* మత్స్యకార భరోసాకు 450
* డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి 3,486
* ఆదరణ పథకానికి 1,000
* ఆర్టీజీఎస్ కోసం 101
* ఎన్టీఆర్ భరోసా పింఛన్లకు 27,518
…………………………………………………….