
ఆకేరు న్యూస్, డెస్క్ : ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహమాన్ (Ar Rahman) చాతీ నొ ప్పితో ఆస్పత్రిలో చేరినట్లు నిన్న వార్తలు వచ్చాయి. వాటిని కుటుంబ సభ్యులు ఖండించారు. రంజాన్ ఉపవాసం ఉండడం వల్ల డీ హైడ్రేషన్ కు గురయ్యారని, మెడ నొప్పితో ఆస్పత్రిలో చేరారని తెలిపారు. ఆదివారం ఉదయం లండన్ (London) నుంచి ఇండియా(India)కు వచ్చిన ఆయన అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరారు. వైద్యులు అతడికి జరిపిన పరీక్షల్లో అన్నీ సాధారణంగా ఉన్నట్లు తేలడంతో, రెహమాన్ ఆరోగ్యం స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు. దీంతో అతడిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశామంటూ వైద్యులు వెల్లడించారు. మరోవైపు రెహమాన్ ఆరోగ్యంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(Mk Stalin) స్పందిస్తూ.. రెహమాన్ త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఇప్పటికే ఆస్కార్ తో సహా ఎన్నో అవార్డులు, రివార్డులు సాధించిన ఏ ఆర్ రహమాన్ ఇప్పటికి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా వరుస సినిమాలు చేస్తున్నారు. ఇటీవలే చావా సినిమాతో అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు ఏ ఆర్ రహమాన్. కొన్ని నెలల క్రితమే తన భార్య సైరా భానుతో ఏ ఆర్ రహమాన్ విడాకులు తీసుకున్నారు.
……………………………