
* కాఫీ స్టాల్ ప్రారంభం
ఆకేరు న్యూస్, డెస్క్ : ఆంధ్రప్రదేశ్ కు చెందిన అరకు కాఫీ ఘుమఘుమలతో పార్లమెంట్ (Parliament) ఆవరణ ఆహ్లాదంగా మారింది. లోక్‌సభ స్పీకర్ (Lok Sabha Speaker) ఓం బిర్లా అనుమతితో పార్లమెంట్ ఆవరణలో అరకు కాఫీ స్టాల్స్‌ను (Araku Coffee Stalls) గిరిజన కోఆపరేటివ్ సొసైటీ ప్రారంభించింది. ఎంపీలు అల్పాహారం తీసుకునే సంగం క్యాంటీన్లో రెండు స్టాళ్లను ఏర్పాటు చేసింది. సంగం 1, 2 కోర్ట్ యార్డ్ వద్ద ఈ స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. లోకసభ క్యాంటీన్లో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు(Kiran Rijuju), రాజ్యసభ క్యాంటీన్లో వాణిజ్య వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ (Piyush goil) అరకు స్టాల్స్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పలువురు కేంద్ర మంత్రులు, తెలుగుదేశం, బీజేపీ పార్టీల ఎంపీలు, నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా అరకు కాఫీ రుచిని ఆస్వాదించారు. సోమవారం నుంచి ఈనెల 28 వరకు స్టాల్స్ ఏర్పాటుకు అవకాశం కల్పించింది.
…………………………………..