* ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
ఆకేరు న్యూస్, అమరావతి : ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్(AP DEPUTY CM PAVAN KALYAN) రెండు రోజులుగా పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. నిన్న పిఠాపురం(PITHAPURAM)లో పర్యటించిన ఆయన హోంమంత్రిని, పోలీసులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. క్రిమినల్స్ కు కులం, మతం చూడడం ఏంటని ప్రశ్నించారు. తాను హోంమంత్రి(HOME MINISTER) పదవిని చేపడితే మరోలా ఉంటుందని హెచ్చరించారు. ఈరోజు పల్నాడు జిల్లా(PALNADU DISTRICT)లోని మాచవరం, దాచేపల్లి మండలాల్లో సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ సంస్థకు చెందిన భూములను ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా మరోసారి పోలీసులను ఉద్దేశించి మాట్లాడారు. శాంతి భద్రతలు ఎంత బలంగా ఉన్నాయో వైసీపీ నేతలకు తెలిసేలా చూపాలన్న పవన్.. పోలీస్ అధికారులు మెత్తబడిపోయారా? లేక భయపడుతున్నారా ప్రశ్నించారు. ప్రజలను కాపాడాల్సిన బాధ్యత పోలీసులదేనని ఆయన చెప్పారు. రౌడీయిజాన్ని అరికట్టాల్సిన బాధ్యత పోలీసులదేనని ఆయన తేల్చి చెప్పారు. శాంతి భద్రతల విషయంలో రాజీపడొద్దని ఆయన పోలీసులకు సూచించారు. రౌడీలు, గూండాలను ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దని ఆయన పోలీసులను ఆదేశించారు. ప్రజల నుంచి భూములు లాక్కొని స్వంత ఆస్తి మాదిరిగా కొట్టుకుంటున్నారని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(CM PAVAN KALYAN) విమర్శించారు. వైసీపీ నాయకులు ఇంకా ప్రభుత్వంలో ఉన్నట్టు ప్రవర్తిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు.
………………………………………………………