* అక్రమ అరెస్ట్‌లను ఖండిస్తున్నాం
* మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి
ఆకేరు న్యూస్, వరంగల్ : మెడికల్ కళాశాల తెచ్చిన మాపై నిర్బంధమా..అని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గురువారం హౌజ్ అరెస్ట్, నియోజకవర్గ వ్యాప్తంగా అక్రమ అరెస్ట్‌లపై నల్లబెల్లిలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన వైద్యం కోసం ముందు చూపుతో బీఆర్ఎస్ హయాంలో జిల్లా ఆసుపత్రి తీసుకురావటం జరిగిందని తెలిపారు. దూరదృష్టితో ఆలోచించాం కాబట్టే ఇంతటి విజయం సాదించామని.. జిల్లా ఆసుపత్రి ఉంటే మెడికల్ కళాశాల వస్తుందనే ఆలోచనలు ఫలించాయని పేర్కొన్నారు. కాంగ్రేస్ ప్రభుత్వాన్ని నడపడం రాక, వాళ్ళు చేసిందేమి లేక వాళ్ళ ఫేయిల్యూర్స్ను ప్రజలు గ్రహిస్తున్నారనే ఉద్దేశ్యంతో అర్థరాత్రి అక్రమ అరెస్ట్‌లకు తెరలేపిందన్నారు. ఈ నిర్బందకాండ ను తీవ్రంగా ఖండిస్తున్నామని, రాజకీయాలకు సమయం కాదు నియోజకవర్గ అభివృద్ది ముఖ్యమని పేర్కొన్నారు.
………………….