
* ఖమ్మం పట్టణ కాంగ్రెస్ మహిళా కార్పొరేటర్ ఆగ్రహం
ఆకేరు న్యూస్ ఖమ్మం : ఖమ్మం పట్టణంలో ఓ మహిళా కార్పొరేటర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తన భర్తను పట్టణంలోని VDO’s కాలనీలో ఉన్న కొంత మంది రౌడీ షీటర్లు చంపేస్తామని బెదిరిస్తున్నారని కాంగ్రెస్ కార్పొరేటర్ మిక్కిలినేని మంజుల వీరంగం ప్రదర్శించారు.రౌడీ షీటర్లు ఉన్నారనే అనుమానంతో చేకూరి శ్రీధర్, శేఖర్ అను వ్యక్తుల ఇళ్లపై కార్పొరేటర్ మంజుల దాగికి దిగి అద్దాలు ధ్వంసం చేశారు. ఈ నేపధ్యంలో స్థానికులు ఆమెను ఆపే ప్రయత్నం చేశారు.ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని, కార్పొరేటర్ అయిన తనకే న్యాయం చేయలేక పోతే ఇక సామాన్యులకు ఏం న్యాయం జరుగుతుందని ఆమె ప్రశ్నించింది.పోలీసులకు చేతకాకపోతే తన అన్నతమ్ముళ్లను పిలిచి రౌడీ షీటర్ల పని చేస్తానని హెచ్చరించారు.
………………………………………..