
ఆకేరున్యూస్, ములుగు: ములుగు జిల్లా కేంద్రంలోని సాయుధ దళ కార్యాలయాన్ని ఎస్పీ శబరీష్ వార్షిక తనిఖీలలో భాగంగా కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఎస్పీ మొదటగా సాయుధ బలగాల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం సాయిధ దళ కార్యాలయం పరిసరాల ను, వాటి పరిశుభ్రతను క్షుణ్ణంగా పరిశీలించారు. అధికారులందరినీ పిలిచి వారు నిర్వర్తిస్తున్న విధులను అడిగి తెలుసుకున్నారు. వివిధ కార్యాలయాల రికార్డులను పరిశీలించి, ఆయా కార్యాలయాలలో పనిచేసే అధికారులు సిబ్బంది ఎప్పటికప్పుడు రికార్డులు పెండిరగ్ లేకుండా పని పూర్తి చేయాలని ఆదేశించారు. బిడి టీం కార్యాలయాన్ని సందర్శించి జిల్లాలో ఉన్న అత్యాధునిక పరికరాల గురించి, వాటి పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు. బీడీ టీం సభ్యులు తమ విధులలో ఎల్లవేళలా అప్రమత్తత కలిగి ఉండాలని సూచించారు. మోటార్ ట్రాన్స్పోర్ట్ కార్యాలయం ను సందర్శించి, అందులో పనిచేసే అధికారులు, సిబ్బంది వివరాలు ఆరా తీశారు. జిల్లాకు కేటాయించిన వాహనాల , వాటి పనితీరుపై సమీక్ష చేశారు. సిబ్బంది ప్రతీ ఒక్కరిని విడివిడిగా వారు నిర్వహించే విధులను గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే వారి యొక్క వ్యక్తిగత సమస్యలు అడిగి తెలుసుకొన్నారు. ఈ తనిఖీలో అడిషనల్ ఎస్పీ సదానందం, ఆర్ఐలు స్వామి, సంతోష్, వెంకటనారాయణ, తిరుపతి, ఆర్ఎస్ఐలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
……………………………………..