* నలుగురు జవాన్లు మృతి
ఆకేరున్యూస్, జమ్ముకశ్మీర్: జమ్ము కశ్మీర్లో ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్మీ వాహనం అదుపుతప్పి లోయలో పడిపోయిన ఘటనలో నలుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. బందిపూర్ జిల్లాలో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని సదర్ కూట్ పాయెన్ సమీపంలోని ఓ వంపు వద్ద డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. అప్రమత్తమైన భద్రతా బలగాలు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ జవాన్లను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తున్నారు.
…………………………………..