ఆకేరు న్యూస్, హైదరాబాద్:
తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు (KCR)ను వర్ధన్నపేట నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు ఆరూరి రమేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. శనివారం (ఏప్రిల్ 04, 2026) ఆరూరి రమేష్ పుట్టినరోజును పురస్కరించుకుని సిద్దిపేట జిల్లాలోని ఎర్రవల్లి నివాసంలో ఆయన కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్ పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. ఆరూరి రమేష్‌కు కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, నిండు నూరేళ్లూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని నిండు మనసుతో ఆశీర్వదించారు. తన రాజకీయ ప్రస్థానంలో వెన్నంటి ఉండి ప్రోత్సహిస్తున్న అధినేతను కలిసి ఆశీస్సులు తీసుకోవడం పట్ల ఆరూరి రమేష్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఆరూరి రమేష్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

—————————–
