
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : అక్రమ సరోగసీ తో పాటు ఎగ్ డొనేట్ చేస్తున్న 8 మంది వ్యక్తుల్ని అరెస్టు చేసినట్లు మేడ్చెల్ డీసీపీ కోటిరెడ్డి తెలిపారు. అరెస్టయిన వారిలో ఏడుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. పిల్లలు లేని జంటలను టార్గెట్ గా చేసుకుని నిందితులు 15- 20 లక్షలు డబ్బులు వసూలు చేస్తున్నారన్నారని డీసీపీ తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలు నర్రెద్దుల లక్ష్మిరెడ్డి అలియాస్ లక్ష్మి గతంలో ఎగ్ డోనర్‌గా, సరోగసి మదర్‌గా పని చేసిన అనుభవం ఉందన్నారు. .. గత అనుభవంతో డబ్బులు సంపాదించాలని అక్రమ సరోగసి విధానానికి తెరలేపారని డీసీపీ తెలిపారు. నర్రెద్దుల లక్ష్మిరెడ్డి కుమారుడు నరేందర్ రెడ్డి కూడా తన తల్లికి తోడుగా ఈ వ్యాపారంలోకి దిగాడని డీసీపీ వివరించారు. నరేందర్ రెడ్డి JNTU లో కెమికల్ ఇంజనీరింగ్ చదివాడని తెలిపారు.నరేందర్ రెడ్డిని A2 నిందితుడు గా ఈ కేసులో ఉన్నాడని డీసీపీ తెలిపారు. డబ్బు అవసరం ఉన్న పేద మహిళలను టార్గెట్ గా చేసుకుని ఎగ్ డొనేట్ చేయించడంతోపాటు, సరోగసికి ఒప్పిస్తున్నారని, నిందితుల దగ్గర నుంచి 6.47 లక్షల నగదు, లెనోవో ల్యాప్‌టాప్, ప్రామిసరీ నోట్లు, బాండ్ పేపర్లు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. సిరంజీలు, గర్భధారణ మందులు, హార్మోన్ ఇంజెక్షన్లు, హెగ్డే హాస్పిటల్ కేస్ షీట్లు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. వీళ్ళిద్దరూ కొన్ని హాస్పిటల్స్ కు ఏజెంట్లకు పనిచేస్తున్నారని డీసీపీ తెలిపారు. సరోగసీ రెగ్యులేషన్ యాక్ట్, అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ యాక్ట్, BNS యాక్ట్ కింద కేసు నమోదు చేసి నిందితుల్ని అరెస్ట్ చేశామన్నారు.
……………………………….