* ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అమావాస్య అన్న వితరణ
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలో స్థానిక ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ముందు బుధవారం అన్నదాన వితరణ చేశారు. పితృదేవతల కోసం ప్రతి అమావాస్య రోజున ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అన్నదాన వితరణ చేస్తారు. పార్శి కృష్ణారావు, పార్శి రంగారావు, గౌరిశెట్టి శ్రీనివాస్, మహంకాళి రవీందర్, ముక్తేశ్వర్, పుల్లూరు కృష్ణమూర్తి, ఏ శ్రీనివాస్ ఆధ్వర్యంలో దాదాపు 200 మందికి పైగా అన్నదానం చేశారు. ఈ అన్నదాన కార్యక్రమంలో స్థానికులతో పాటు ఆయా గ్రామాల నుండి వివిధ పనుల కోసం మండల కేంద్రానికి వచ్చిన రైతులు, ప్రయాణికులు ఈ అన్నదాన వితరణ కార్యక్రమంలో పాల్గొంటారు.
