* రిటైర్మెంట్ ప్రకటించిన స్పిన్ లెజెండర్
ఆకేరు న్యూస్, స్పోర్ట్స్ డెస్క్ : అంతర్జాతీయ క్రికెట్ కు స్పిన్ లెజెండ్ రవిచంద్రన్ అశ్విన్(RAVICHANDRAN ASHWIN) వీడ్కోలు తెలిపారు. అన్ని ఫార్మాట్ లకూ రిటైర్మెంట్ ప్రకటించారు. అశ్విన్ రిటైర్మెంట్ పై బీసీసీఐ(BCCI) ట్వీట్ చేసింది. అశ్విన్ లెజెండరీ కెరీర్‌కు ధన్యవాదాలు తెలిపింది. రవిచంద్రన్ అశ్విన్ అమూల్యమైన ఆల్ రౌండర్ అని కితాబిచ్చింది.
అశ్విన్ ప్రత్యేకతలు ఇవీ..
* అశ్విన్ 2010లో శ్రీలంక(SRILANKA)పై వన్డే ద్వారా అరంగేట్రం చేశారు.
* 2011లో వెస్ట్ ఇండిస్(WEST INDIS) పై టెస్ట్ లలో అరంగేట్రం చేశారు.
* ఆడిలైడ్ లో ఆస్ట్రేలియా(AUSTRALIA)తో చివరి టెస్ట్ ఆడారు.
* 106 టెస్టులు, 116 వన్డేలు, 65 టీ20 మ్యాచ్ లు ఆడారు.
* టెస్టుల్లో 537, వన్డేల్లో 156, టీ20ల్లో 72 వికెట్లు తీశారు.
* మొత్తంగా 765 అంతర్జాతీయ వికెట్లు తీశారు.
* టెస్టుల్లో 37 సార్లు ఐదు వికెట్లు తీశారు.
* టెస్టుల్లో ఎనిమిది సార్లు 10 వికెట్లు తీసిన చరిత్ర
* టెస్టుల్లో 6 సెంచరీలు, 14 అర్ధశతకాలతో 3503 పరుగులు తీశారు.
………………………………………..