
* అత్యంత ధనవంతుడిగా ముందున్న జస్టిస్ విశ్వనాథన్
ఆకేరున్యూస్, ఢల్లీి: సుప్రీం కోర్టు న్యాయమూర్తులు తమ తమ ఆస్తుల వివరాలను వెల్లడిరచారు. ఈ మేరకు వెబ్సైట్లో తమ ఆస్తుల వివరాలను పొందుపరిచారు. రాజకీయనాయకులు ముఖ్యంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు చేయలేని పనిని వారు చేసి ఆదర్శంగా నిలిచారు. ఏప్రిల్ 1న జరిగిన సుప్రీంకోర్టు జడ్జెస్ ఫుల్ కోర్టు విూటింగ్‌లో ఆస్తుల వివరాలు వెల్లడిరచాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం మేరకు సుప్రీంకోర్టు అధికారిక వెబ్సైట్లో న్యాయమూర్తులు తమ ఆస్తుల వివరాలను వెల్లడిరచారు. సుప్రీంకోర్టులో మొత్తం 33 మంది న్యాయమూర్తులకు గాను 21 మంది జడ్జిలు తమ ఆస్తుల వివరాలను వెబ్సైట్లో ఉంచారు. ఈ క్రమంలో న్యాయమూర్తుల్లో అత్యంత ధనిక న్యాయమూర్తి జస్టిస్ కె.వి విశ్వనాథన్ అని లెక్కలు చెబుతున్నాయి. ఆయన తన ఆస్తుల వివరాలను సుప్రీం కోర్టు అధికారిక వెబ్సైట్లో పొందుపర్చారు. ఇంతకీ జస్టిస్ కెవి విశ్వనాథన్ ఆస్తులు ఎంత.. అలాగే మిగిలిన జస్టిస్‌ల ఆస్తుల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ కె వి విశ్వనాథన్ సూపర్ రిచ్ అని తేలింది. సుదీర్ఘ కాలం న్యాయవాదిగా పనిచేసి అనంతరం సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ విశ్వనాథన్ నియమితులయ్యారు. రూ.120 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడంతో పాటు గత పది ఏళ్లుగా రూ.91 కోట్ల రూపాయలు ఆదాయపన్ను చెల్లించారు జస్టిస్. సుప్రీంకోర్టులోని మొత్తం 33 మంది న్యాయమూర్తుల్లో నిన్న (సోమవారం) అర్ధరాత్రికి సుప్రీంకోర్టు వెబ్‌సైట్స్‌లో 21 మంది న్యాయమూర్తులు తమ తమ ఆస్తుల వివరాల వెల్లడిరచారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ కన్నాకు బ్యాంక్ అకౌంట్లో రూ.55.75 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్స్ , పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌లో రూ. 1.06 కోట్లు ఉన్నాయి. సౌత్ ఢల్లీిలో టూ బెడ్ రూమ్ డీడీఏ ఫ్లాట్‌తో పాటు కామన్వెల్త్ గేమ్స్ విలేజ్‌లో ఫోర్ బెడ్ రూమ్ ఫ్లాట్ సంజీవ్ కన్నాకు ఉంది. కూతురితో కలిసి మరో ఫోర్ బెడ్ రూమ్ ఫ్లాట్‌లో 56శాతం వాటాదారుడుగా సంజీవ్ కన్నా ఉన్నారు. తదుపరి సీజేఐ కానున్న జస్టిస్ గవాయ్‌కు బ్యాంక్ అకౌంట్లో రూ.19.63 లక్షలు, పీపీఎఫ్ అకౌంట్లో రూ.6.59 లక్షలు ఉన్నాయి. జస్టిస్ గవాయ్‌కు అమరావతి నాగపూర్‌లో వారసత్వంగా వచ్చిన వ్యవసాయ భూములు కూడా ఉన్నాయి. మహారాష్ట్రలోని అమరావతిలో వారసత్వంగా వచ్చిన ఇల్లుతో పాటు ముంబై, ఢల్లీిలో రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. అలాగే జస్టిస్ ఓకాకు పీపీఎఫ్‌లో రూ.92.35 లక్షలు, ఫిక్స్ డిపాజిట్ల రూపంలో రూ.21.76 లక్షలు ఉన్నాయి. జస్టిస్ ఓకాకు మారుతి బలేనో కారు ఉండగా దానిపై రూ.5.1 లక్షల రుణం ఉంది.
……………………………………………………