
ఆకేరు న్యూస్, ములుగు: క్రీడాకారులు క్రీడలతో పాటు తమ తల్లిదండ్రులకు అండగా నిలవాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కుంజ సూర్యం సూచించారు. ములుగు మండలం జాకారం గ్రామంలో ఉమ్మడి వరంగల్ జిల్లా కబడ్డీ, వాలీబాల్, కోకో,జట్ల ఎంపిక కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై క్రీడా పోటీలను ప్రారంబించారు. అనంతరం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతి యువకులు క్రీడలోనే కాకుండా తమ తమ కుటుంబాలకు అండగా నిలవాలని క్రీడాకారులకు సూచించారు. యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా తల్లిదండ్రులకు, దేశానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. పోటీల్లో అఫిషియల్ కి టీషర్ట్ లను క్రీడాకారులకు ఉచితంగా పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు పల్లె జైపాల్ రెడ్డి,నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మారం సుమన్ రెడ్డి,యూత్ కాంగ్రెస్ కార్యదర్శి నేపాల్ రావు ,యూత్ నాయకులు సన్,తిరుపతి గమ,సతీష్ ,భూషణ్ ,రమేష్ ,రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
…………………………………………………..