
* సికింద్రాబాద్ ఎంఎంటీఎస్ రైలులో యువతిపై అత్యాచారయత్నం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వెళ్తున్న ఎంఎంటీఎస్ రైలు(MMTS Train)లో దారుణం చోటుచేసుకుంది. యువతిపై దుండగుడు అత్యాచారయత్నం చేశాడు. ఈ ఘటన సంచలనంగా మారింది.. సికింద్రాబాద్ (Secunderabad) నుంచి మేడ్చల్ వెళ్తున్న ఎంఎంటిఎస్ ట్రైన్లో ఒంటరిగా ఉన్న యువతిపై ఓ దుండగుడు అత్యాచారయత్నం (Rape Attempt) చేశాడు.. దీంతో యువతి అతన్ని ప్రతిఘటించి.. కదులుతున్న ట్రైన్లో నుంచి ఒక్కసారిగా దూకేసింది.. దీంతో యువతికి తీవ్రగాయాలయ్యాయి. తీవ్రగాయాలపాలైన ఆ యువతిని పోలీసులు గాంధీ ఆసుపత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న సికింద్రాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.. దుండగుడి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
……………………………..