
* భార్య గొంతుకోసి భర్త పరార్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : మానవత్వం మంట గలిసిన వేళ.. అత్యంత దారుణాలు చోటుచేసుకుంటాయి. భార్యను దారుణంగా హత్య చేశాడు ఓ ప్రబుద్దుడు.భార్య గొంతు కోసి పరారయిన ఘటన హైదరాబాద్ లోని కుషాయిగూడలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మహారాష్ట్రకు చెందిన ఓ జంట కుషాయిగూడలోని రాధికా థియేటర్ వద్ద నివాసం ఉంటున్నారు. భార్య తరపున బంధువులు ఇంట్లో ఉన్న సమయంలోనే కత్తితో భార్య గొంతు కోసి హత్య చేసి పరారయ్యాడు.బంధువులు స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు స్థానికులను వివరాలు అడిగితెలుసుకుంటున్నారు. పరారయిన నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
………………………………………