
* కటేదాన్ లో ఘటన
ఆకేరు న్యూస్ హైదరాబాద్ : తన భార్యను ఎందుకు చంపాలను కున్నాడో ఏమో కాని బాగా తాగిన మైకంలో భార్య అనుకొని మరో మహిళపై కత్తితోదాడి చేశాడు..ఈ ఘటన హైదరాబాద్ లోని మైలార్దేవ్ పల్లి పరిధిలోని కటేదాన్ లో జరిగింది. మహారాష్ట్రకు చెందిన సలీం తన భార్యతో కాటేదాన్ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు.గత కొంత కాలంగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో భార్యను చంపాలని ప్లాన్ వేసుకున్న సలీం శుక్రవారనం రాత్రి బాగా తాగి వచ్చి మైకంలో తన్న ఇల్లు అనుకొని పక్కింట్లో ప్రవేశించి తన భార్య అనుకొని పక్కింట్లో నిద్రిస్తున్న మహిళపై కత్తితో దాడిచేశాడు. ఇది గమనించిన స్థానికులు వెంటనే సలీంను నివారించి కత్తిపోట్లకు గురైన మహిళను ఆస్పత్రికి తరలించారు. మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
…………………………………………………….