
* మాదిగ దండోరా జాతీయ నేత నెమలి నర్సయ్యమాదిగ
ఆకేరు న్యూస్, ములుగు: భారతదేశ ప్రధాన న్యాయమూర్తి BR గవాయి పై దాడి చేసిన నిందితుడిపై దేశద్రోహం కేసు నమోదు చేసి తక్షణమే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ములుగు జిల్లా కేంద్రంలోని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి/ మహాజన సోషలిస్టు పార్టీ ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి కల్లేపల్లి రమేష్ మాదిగ ఆధ్వర్యంలో తాసిల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందచేశారు.ఈ సందర్భంగా కార్యక్రమం ముఖ్య అతిథులు మాదిగ దండోరా జాతీయ నాయకులు నెమలి నర్సయ్యమాదిగ మాట్లాడుతూ.. భారతదేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి BR గావాయి పై దాడి చేసిన నిందితుడిపై దేశద్రోహం కేసు నమోదు చేసి తక్షణమే కఠినంగా శిక్షించాలని, దాడి వెనుక ఉన్నటువంటి అరాచక శక్తులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి వెంటనే వాటిని కట్టడి చేాలని డిమాండ్ చేశారు. వారికి కూడా శిక్షలు పడేలా స్వతంత్ర దర్యాప్తు చేయాలన్నారు.ఇందుకోసం సుప్రీంకోర్టులో ప్రజాస్వామిక వాదులుగా గుర్తించబడ్డ సీనియర్ జడ్జిలతో విచారణ చేయాలని కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకునేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలకు రాజ్యాంగంలోని సూత్రాలు తీసుకొని చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహాజన సోషలిస్టు పార్టీ ములుగు జిల్లా ఉపాధ్యక్షులు మరాటీ రవీందర్ మాదిగ మాదిగ. MSP జిల్లా నాయకులు, రోoటాల బిక్షపతి మాదిగ. బలుగురి భద్రయ్య మాదిగ. ఆదివాసీ నాయక పోడ్ దెబ్బ యువసేన విభాగం ములుగు మండల కన్వీనర్ కస్తూరి ప్రశాంత్ నాయకపోడ్, జగన్నాథం సాంబయ్య జొన్న సుధాకర్ మాదిగ మామిడి రాజపోషక్క తదితరులు పాల్గొన్నారు.జిల్లా వ్యాప్తంగా మండలం కేంద్రాలలో ఎం ఆర్ పి ఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు వెల్లువెత్తాయి.
……………………………………………………..