
* అందరూ ముక్తకంఠంతో ఖండించాలి
* నిందితుడిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి
* భవిష్యత్ లో ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలి
* జస్టిస్ గవాయ్ పై దాడిని ఖండించిన ఎమ్మెల్సీ కోదండరామ్
ఆకేరు న్యూస్ డెస్క్ : గవాయ్ పై దాడి సుప్రీంకోర్టు వ్యవస్థపై చేసిన దాడి అని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. జస్టిస్ గవాయ్ పై చేసిన దాడిని ఆయన ఖండించారు. ఇది రాజ్యాంగంపై చేసిన దాడిగా ఆయన అభివర్ణించారు.దాడికి ప్రత్యేకమైన కారణాలు ఏమీ లేవని ఆయన అన్నారు
జస్టిస్ గవాయ్ అభిప్రాయాలు నచ్చక ఆయనపై దాడికి దిగడం అన్యామన్నారు. అభిప్రాయాలకు నచ్చక పోతే ఇలా అసహనం ప్రదర్శించడం మంచిది కాదు అని అన్నారు. ఇది అందరూ ముక్తకంఠంతో వ్యతిరేకించాలని కోరారుజ జస్టిస్ గవాయ్ రాజ్యాంగవిలువలను కాపాడే వ్యక్తి అని అంబేద్కర్ ఆలోచనలను స్ఫూర్తిగా తీసుకున్న వ్యక్తి అని కోదండరాం అన్నారు. ఒక దళితుడైనందుకే ఆయనపై దాడి చేశారు. దాడి చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.భవిష్యత్ లో ఎవరూ ఇలాంటి ఘటనలు చేయకుండా సుప్రీంకోర్టు న్యాయవాది రాకేశ్ కిషోర్ పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
……………………………………….