ఆకేరు న్యూస్, మహబూబాబాద్ : రాష్ట్రంలో ఆర్టీసీ డ్రైవర్లపై దాడులు కొనసాగుతున్నాయి. సిరిసిల్ల ఘటన
మరువకముందే.. నర్సంపేటలో మరో ఘటన చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళవారం రాత్రి కొందరు వ్యక్తులు హైదరాబాద్ నుంచి మహబూబాబాద్‌కు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎక్కారు. డ్రైవర్ పక్కనే ఉన్న గేర్ బాక్స్‌పై కూర్చొన్నారు. ఇంతలో తాము ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి బంధువులమంటూ హంగామా చేశారు. తాగిన మైకంలో ఇష్టాననుసారంగా వ్యవహరించారు. బూతులు మాట్లాడుతూ.. ప్రయాణికులకు ఇబ్బందులకు గురి చేశారు. అడ్డుకోబోయిన డ్రైవర్‌పై దాడికి దిగారు. దీంతో బస్సును నేరుగా పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లాడు. దాడి ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ సంఘటనతో బస్సులో ఉన్న ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు.
………………………………………………….
