
* పోలీసుల అదుపులో నిందితుడు
ఆకేరు న్యూస్, న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తాపై ఓ దుండగుడు దాడికి యత్నించాడు. తన నివాసంలో ప్రజాదర్జార్(Prajadarbhar) నిర్వహిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఫిర్యాదుదారుడిగా వచ్చి దాడికి పాల్పడ్డాడు. సివిల్ లైన్స్‌లోని ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో బహిరంగ విచారణ సందర్భంగా ఈ ఘటన జరిగింది. ఒక వ్యక్తి రాయి లాంటి వస్తువుతో ఆమెపై దాడి చేయడానికి ప్రయత్నించాడు. అసభ్యకరమైన భాషతో దూషిస్తూ.. దాడికి తెగబడ్డాడు. దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి వయస్సు దాదాపు 35 సంవత్సరాలు అని, అతని చేతిలో కొన్ని కాగితాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. దాడి ఘటన తర్వాత వెంటనే అప్రమత్తమయ్యారు. భద్రతను కట్టుదిట్టం చేశారు. నిందితుడికి ఏదైనా రాజకీయ పార్టీతో సంబంధం ఉందా అనే కోణంలో కేసు దర్యాప్తు చేస్తున్నారు. సీఎం రేఖ గుప్తా(Cm Rekha Gupta)పై జరిగిన దాడిపై ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా స్పందించారు. సీఎంపై జరిగిన దాడిని వీరేంద్ర సచ్‌దేవా తీవ్రంగా ఖండించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు. త్వరలోనే ఈ సంఘటనకు సంబంధించిన మొత్తం నిజం బయటకు వస్తుందని అన్నారు.
……………………………………..