
ఆకేరు న్యూస్ వికారాబాద్: రోజు రోజుకూ బాలికలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. తొమ్మిదేళ్ల బాలికపై ఓ వ్యక్తి అత్యాచార యత్నానికి పాల్పడ్డ దారుణ సంఘటన వికారాబాద్ జిల్లా చన్గోముల్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సంఘటనకు సంబంధించిన వివరాలు పోలీసుల కథనం ప్రకారం.. బాధిత బాలిక తల్లిదండ్రులు చన్గోముల్ నేవీ రాడార్ స్టేషన్లో పని చేస్తున్నారు. నిందితుడు ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఒక వ్యక్తి, కూడా అదే ప్రాంగణంలో లేబర్‌గా పనిచేస్తున్నాడు. బాలికను ఏకాంతంలో చూసి, ఆమెపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. బాలిక కేకలు గమనించిన స్థానికులు స్పందించి వెంటనే నిందితుడిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. బాలికను కుటుంబ సభ్యులు సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
…………………………………………..