
ఆకేరు న్యూస్ డెస్క్ : 50 ఏళ్ల చరిత్రలో భద్రాచలంలో ఎక్కువ సార్లు వరదొచ్చింది ఆగస్టు నెలలోనే. ప్రస్తుతం వరదతో భద్రాచలం వద్ద గోదావరి క్రమంగా ప్రమాదస్థాయికిచేరుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గడిచిన నాలుగు రోజులుగా నీటిమట్టం పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. జులైలో సుమారు 36 అడుగుల మేర నీరు ప్రవహించగా, ఇప్పుడు దాన్ని మించి ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ ప్రాంతంలోని ప్రాణహిత వైపునుంచి పేరూరు మీదుగా భద్రాచలం వైపు వరద నీరు వస్తుండగా దిగువన శబరి నది నీటిమట్టం పెరుగుతుండడంతో గోదావరికి ఎగపోటు తప్పని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే లోతట్టు ప్రాంతాల వైపు వరద పరుగు పెట్టే వీలుందని అధికారులు అంచనా వేస్తున్నారు. నదిలో లోతుకు వెళ్లవద్దని మైకుల ద్వారా అధికారులు హెచ్చరిస్తున్నారు.
………………………………