* ఐదు మ్యాచ్ల సిరీస్లో 1-1తో సమంగా ఇరు జట్లు
ఆకేరు న్యూస్, స్పోర్ట్స్ డెస్క్ : ఆస్ట్రేలియా – భారత్ (Astrelia – India) క్రికెట్ జట్ల మధ్య జరుగుతున్న బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో మూడో టెస్టు డ్రాగా నిలిచింది. బ్రిస్బేన్(Brisben) లోని గబ్బా స్టేడియంలో జరుగుతున్న మూడో టెస్టులో ఆసిస్ జట్టు టీమిండియా ముందు 275 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. తమ రెండో ఇన్నింగ్స్ ను వాళ్లు కేవలం 89 పరుగుల దగ్గరే డిక్లేర్ చేసి టీమిండియా(Teamindia)కు సవాలు విసిరింది. చివరి రోజు ఈ టార్గెట్ చేజ్ చేయడం అంత సులువు కాదని ముందుగానే వూహించింది. కంగారూలు ఊహించినట్లుగానే భారత్ 260 కు ఆలౌట్ అయింది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 1-1తో సమమైంది. తొలి టెస్టులో భారత్ 295 పరుగుల తేడాతో గెలుపొందగా, రెండో టెస్టులో ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆస్ట్రేలియా(Astrelia) స్కోర్ 445 ఆలౌట్, 89/7 డిక్లేర్డ్.
………………………………………