* అత్యవసరం ఉంటే తప్ప ప్రజలెవ్వరు బయటకు రావద్దు
* ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
* అత్యవసర పరిస్థితుల్లో ఐటీడీఏ ఏటూరునాగారంలో కంట్రోల్ రూమ్ సెల్ నెo. 6309842395. 08717-293246 * లేదా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ నంబర్ 1800 425 7109 ను సంప్రదించాలి
* రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ సీతక్క
ఆకేరున్యూస్, వరంగల్ : జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రయాణాలు చేయవద్దని, వర్షాలు తగ్గుముఖం పట్టేంత వరకు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ సీతక్క ప్రజలకు సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో ఐటీడీఏ ఏటూరు నాగారం కంట్రోల్ రూమ్ సెల్ నంబర్ 6309842395, 08717-293246 లేదా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ నంబర్ 1800 425 7109ను సంప్రదించాలని చెప్పారు. జిల్లాలో ఆగస్టు 31, సెప్టెంబర్ 1న అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, వీటి వల్ల పెద్ద ఎత్తున వరదలు వచ్చే ప్రమాదం ఉందని, దీనిని గమనించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. అతి భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని, ప్రతీ అధికారి హెడ్ క్వార్టర్ మైంటైన్ చేయాలని, రోడ్ల పై వరద నీటిని ఎప్పటికప్పుడు స్థానిక సంస్థ సిబ్బంది క్లియర్ చేయాలని, విద్యుత్, తాగునీటి సరఫరా ఎప్పటికప్పుడు పునరుద్ధరణ చేసేలా చూడాలనీ అధికారులను ఆదేశించారు. భారీ వరదలు వచ్చే నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వీలుగా పునరావాస కేంద్రాలను సిద్ధం చేయాలని సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలోని నీటి వనరులు అందులోని నీటి నిల్వ పరిస్థితి, చెరువు కట్టలు మొదలవు వాటిని అధికారులు పరిశీలించాలని తెలిపారు. అతి భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అధికార యంత్రంగానికి సంపూర్ణంగా సహకరించాలని, 48 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
