
* ఒకరు మృతి
*ఒకరి పరిస్థితి విషమం.. మరొకరికి గాయాలు
ఆకేరు న్యూస్, మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లాలోని నెల్లికుదురు మండలం మునిగలవేడు గ్రామంలో ఆదివారం అర్థరాత్రి ఓ ఆటో అదుపు తప్పి బావిలో పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఆటోలో భార్యాభర్తలు, వారి కొడుకు ప్రయాణిస్తుండగా, అదుపు తప్పి బావిలో ఆటో పడింది. అటుగా వెళ్తున్నవారు గమనించి బాధితులను బావి నుంచి తీశారు. కాగా, భర్త శ్రీరామ్ నర్సయ్య గాయపడి మరణించాడు. భార్య శ్రీరామ్ భారతమ్మ, కొడుకు మార్కండేయకు గాయాలయ్యాయి. భారతమ్మ పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి పోలీసులు, అధికారులు చేరుకుని ఆటోను బావిలో నుంచి బయటకు తీశారు. కేసు నమోదుచేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
…………………………………..