
* ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
ఆకేరున్యూస్ హనుమకొండ : రేబిస్ వంటి ప్రాణాంతకమైన వ్యాధుల గురించి ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. ప్రపంచ రేబిస్ దినోత్సవం సందర్భంగా బాలసముద్రంలోని పెట్ పార్క్ లో జరిగిన ప్రపంచ రేబిస్ దినోత్సవ వేడుకలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు, ఈ సందర్భంగా మాట్లాడుతూ,ప్రజలలో పశుప్రేమ మరియు పశు ఆరోగ్యంపై అవగాహన పెంపొందించాలన్న ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయం అన్నారు. రేబిస్ వంటి ప్రాణాంతక వ్యాధులపై ప్రజలకు సరైన సమాచారాన్ని అందించడం ద్వారా తగిన జాగ్రత్తలు తీసుకునే అవకాశం లభిస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు,పార్టీ నాయకులు,అధికారులు,అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.
………………………………………