
* ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి సీతక్క
ఆకేరు న్యూస్, ములుగు: మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడానికి రాష్ట్ర వ్యాప్తంగా పలు కార్యక్రమాలను చేపడుతోందని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు.
మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరం లో వీ హబ్ (Women Entrepreneurs Hub, Dept. of ITE&C, Govt. of Telangana) ఆధ్వర్యంలో జిల్లాలోని SHG మహిళలు, మహిళా పరిశ్రామికవేత్తలకు ర్యాంప్ (రైసింగ్ అండ్ యాక్సిలరేటింగ్ MSME పెర్ఫార్మెన్స్ స్కీమ్) ప్రోగ్రాం పైన అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ “మహిళలను ఆర్థికంగా పరిపుష్టం చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం మహిళాశక్తి లో బాగంగా ఎన్నో ప్రోత్సాహకాలు ఇస్తోందన్నారు. దానిలో భాగంగానే వీ హబ్ మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడానికి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కార్యక్రమాలను చేపడుతోందని అన్నారు. వీ హబ్ ఇంప్లిమెంట్ చేస్తున్న రామ్ ప్రోగ్రాం ను సద్వినియోగం చేసుకొని మహిళలు తమ వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవాలని అన్నారు.
వరల్డ్ బ్యాంక్, కేంద్ర ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ ఎం ఎస్ ఎం ఈ ఆధ్వర్యంలో చేపడుతున్న
ఈ ప్రోగ్రాం ద్వారా మహిళల ఆధ్వర్యంలో నడుస్తున్న వ్యాపారాలు, ఎం ఎస్ ఎం ఈ లకు బిజినెస్ యక్షలరేషన్ సపోర్ట్ అందనుంది. రెండు సంవత్సరాల పాటు కొనసాగనున్న ఈ ప్రోగ్రాం లో రాష్ట్ర వ్యాప్తంగా ఎంపికైన మహిళా పరిశ్రామికవేత్తలకు తమ బిజినెస్ అభివృద్ధిని వేగవంతం చేసుకొని తమ ఆదాయాన్ని పెంచుకునే అవకాశం లభిస్తుందని వీ హబ్ సిఈఓ సీత పళ్ళచోళ్ళ తెలిపారు. దీనిలో భాగంగా టెక్స్టైల్స్, ఫుడ్ ప్రాసెసింగ్, మాన్యుఫాక్చరింగ్, హస్తకళలు వంటి రంగాల్లోని వ్యాపారులకు బిజినెస్ నైపుణ్యాలపై శిక్షణ, ప్రొడక్ట్ డెవలప్మెంట్ & డైవర్సిఫికేషన్, బ్రాండింగ్ & మార్కెట్ యాక్సెస్, క్రెడిట్ లింకేజ్, ఎక్స్పర్ట్ మెంటరింగ్ మద్దతు ఇస్తామని వీ హబ్ సోషల్ ఇంపాక్ట్ & ఎంట్రప్రెన్యూషిప్ విభాగం డైరెక్టర్ జాహిద్ షేక్, అసోసియేట్ డైరెక్టర్ ఊహ తెలిపారు.
ఈ అవగాహన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్
వీ హబ్ అసోసియేట్ డైరెక్టర్ ఊహ, డిఆర్డిఓ శ్రీనివాస్ రావు, ప్రాజెక్ట్ మేనేజర్ తాజ్దర్, గురు, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ సాయి రామ్, మునీష్, సౌమ్య, జీ.ఎం. ఇండస్ట్రీస్ సిద్దార్త రెడ్డి, అడిషనల్ డి ఆర్ డి ఓ శ్రీనివాస్, డిపిఎంలు, తదితరులు పాల్గొన్నారు.
………………………………………..