* కలెక్టర్ జెసి దివాకర
ఆకేరు న్యూస్, ములుగు: ములుగు జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామంలో పోషణ అవగాహన ర్యాలీలు, పోషణ వాణిజ్య ప్రదర్శనలు (Nutrition Exhibitions) నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జెసి దివాకర సూచించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రీయ ఎనిమిదవ నెల పోషణ్ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈనెల 17 నుంచి వచ్చే నెల 16వ తేదీ వరకు జిల్లాలోని సిడిపివోలు, పోషన్ అభియాన్ సిబ్బంది, మెడికల్ అండ్ హెల్త్ ,పంచాయతీరాజ్ ,విద్యాశాఖ తదితర శాఖల ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రాల్లో “పోషణ్ ర్యాలీలు”, ఆరోగ్య పరీక్షలు, BMI పరీక్షలు నిర్వహించాలన్నారు.
గర్భిణులకు చిన్నారులకు ఐరన్, ఫోలిక్ యాసిడ్ మాత్రలు పంపిణీ చేయాలని,
స్థానిక విద్యార్థులు, మహిళా సంఘాలు, సర్వే సభ్యుల ద్వారా ప్రజల్లో పోషణపై అవగాహన కల్పించాలని ANMలు, ఆశా కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి పోషకాహారానికి సంబంధించిన సలహాలు అందించాలని సూచించారు. ఈ నెలంతా పోషణ గురువులు, అంగన్వాడీ కార్యకర్తలతో కలసి వివిధ కార్యక్రమాలు — తల్లి సమావేశాలు, వంటల పోటీలు, పోషకాహార ప్రదర్శనలు, పాలు-పండ్లు పంపిణీ మొదలైనవి నిర్వహించాలని కోరారు.
ఈ సమావేశంలో DM&HO డాక్టర్ గోపాల్ రావు, జిల్లా సంక్షేమ అధికారి మరియు ఐసీడీఎస్ ప్రాజెక్ట్ CDPOలు, వైద్య సిబ్బంది, అంగన్వాడీ సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.
………………………………………
