* ఎన్నికల సంఘానికి ఫిర్యాదు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : జూబ్లీహిల్స్ లో ఉప ఎన్నిక జరుగుతున్న వేళ.. కాంగ్రెస్ నేత మహ్మద్ అజహరుద్దీన్ ను మంత్రి వర్గంలోకి తీసుకుంటున్నారన్న వార్తలపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇలాంటి సమయంలో అలాంటి ప్రకటనలు, మంత్రివర్గ విస్తరణ సరికాదని పేర్కొంటోంది. ఈ మేరకు బీజేపీ ఎలక్షన్ కమిషన్ అఫైర్స్ కమిటీ చైర్మన్ మర్రి శశిధర్ రెడ్డి, ఎమ్మెల్యే పాల్వాయి శంకర్ తదితరులు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డిని కలిసి మంత్రివర్గ విస్తరణకు అనుమతి ఇవ్వవద్దని ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తోందని వారు ఆరోపించారు. ఒక వర్గం ఓట్ల కోసమే హడావుడిగా మంత్రివర్గ విస్తరణ చేపట్టారని విమర్శించారు. అజారుద్దీన్ గతంలో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారని గుర్తు చేశారు. మంత్రివర్గ విస్తరణను నిలిపివేయాలని కోరారు. అయితే అజహరుద్దీన్ కు మంత్రి పదవి, మంత్రివర్గ విస్తరణపై అధికారిక ప్రకటన లేదు. మరి ఈసీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
……………………………………………
