* ఎల్లుండే ప్రమాణస్వీకారం
* ఎంఎల్సీగా అవకాశం కల్పించి.. మంత్రిగా అవకాశం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ప్రముఖ క్రికెటర్ అజహరొద్ధీన్కు మంత్రి పదవీ దక్కనుంది. తెలంగాణ కేబినెట్ని విస్తరించడానికి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఎల్లుండి(శుక్రవారం) ఉదయం11గంటలకు కేబినెట్ని విస్తరించడానికి మార్గం సుగమం చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ క్రికెటర్ అజారుద్దీన్ (Azharuddin)ని మంత్రివర్గంలోకి తీసుకోవాలని కాంగ్రెస్ సర్కార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణం స్వీకారం చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అజారుద్దీన్‌కు హోం, మైనారిటీ శాఖ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. మంత్రివర్గ విస్తరణకు ఏఐసీసీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
…………………………………………..
