ఆకేరున్యూస్ హైదరాబాద్ ః ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు,ఇంద్రజాలికుడు బీవీ పట్టాభిరామ్ గుండెపోటుతో హైదరాబాద్‌లోని ఆయన స్వగృహంలో మంగళవారం తుది శ్వాస విడిచారు. వ్యక్తిత్వ వికాసంపై ఆయన పలు రచనలు చేశారు. ఆయన వయస్సు 75 సంవత్సరాలు. హిప్నాటిస్టుగా ఆయన పేరు పొందారు.వ్యక్తిత్వ వికాసంపై ఆయన పలు పుస్తకాలు రాశారు. ఆయనకు భార్య జయ, కుమారుడు ప్రశాంత్ ఉన్నారు.విద్యా\ర్థుల్లో వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించడానికి ఆయన ప్రత్యేక తరగతులు నిర్వహించేవారు.అలాగే పిల్లల పోషణలో తల్లిదండ్రులు ఎలా వ్యవహరించాలనే దానిపై తల్లిదండ్రలకు అవగాహనా కార్యక్రమాలు నిర్వహించేవారు.బివి పట్టాభిరామ్ ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి పిహెచ్ డి పట్టాపొందారు.ఒత్తిడిని జయించడం వ్యక్తుల మధ్య సంబందాలు,అసర్టివ్ నెస్ సెల్ఫ్ హిప్రాటిజం మొదలైన అంశాలపై భారతదేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో వర్క్‌షాపులను నిర్వహించారు.
……………………………….
