* ఒక్క రోజే 20మందిపై దాడి
* బయటకు రావాలంటేనే వణుకుతున్న జనం
* చిన్నపిల్లలపై విరుచుకుపడుతున్న కుక్కలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : వీధి కుక్కల బాధ రోజురోజుకూ తీవ్రమవుతోంది. వీధి కుక్కలను నియంత్రించాల్సిన యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందనే విమర్శలు వస్తున్నాయి, హైదరాబాద్ లోని వీధుల్లో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. ఆది వారం ఉదయం వీధి కుక్కల దాడిలో 20 మంది ఆస్పత్రి పాలైనారు. బాధితులందరూ హుటా హుటిన సమీప ఆస్పత్రులకు వెళ్లి యాంటీ రాబీస్ ఇంజక్షన్లు వేసుకున్నారు. గతంలో కుక్క కాటు వల్ల రేబిస్ వ్యాధి సోకి సంభవించిన మరణాలు ఎన్నో ఉన్నాయి. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని వీధి కుక్కలను నియంత్రించాల్సి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. వీధి కుక్కలకు యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ తో పాటు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహిస్తే వీధికుక్కుల సంఖ్యను నివారించవచ్చు
తెలంగాణలోనే దేశ వ్యాప్తంగా ఈ సమస్య తీవ్రంగా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో వీధి కుక్కల బారిన వందలాది మంది పడితే చివరికి సమస్య సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. రెండు రోజుల క్రితమే సుప్రీం కోర్టు
వీధి కుక్కలను జస సమూహాలు ఉన్న ప్రదేశాల్లోకి రానివ్వకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసి రెండు రోజులు కూడా కాలేదు సుప్రీం కోర్టు జారీ చేసిన ఆదేశాలను పాటించకుండా ఉంటే ఫలితం ఎలా ఉంటుందో ఆదివారం హైదరాబాద్ లో కన్పించింది.

………………………………………..
