
* సింగపూర్ మంత్రి టాన్ సీ లెంగ్ తో భేటీ
ఆకేరున్యూస్ డెస్క్ : ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ ( SINGAPUR) పర్యటన రెండో రోజుకు చేరుకుంది. రెండో రోజు చంద్రబాబు(CHANDRA BABU NAIDU) పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సింగపూర్ పరిశ్రమల మంత్రి టాన్ సీ లెంగ్ ( TAN SEE LENG)తో సమావేశయ్యారు. గత ప్రభుత్వం హయాంలో ఏపీలో సింగపూర్ కంపెనీలు ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి సింగపూర్ మంత్రి బాబు దృష్టికి తీసుకొచ్చారు. గతంలో జరిగిన అంశాలపై చర్చించి ఆ రికార్డులను సరిదిద్దడానికే తాను సింగపూర్ వచ్చానని బాబు సింగపూర్ మంత్రి టాన్ సీ లాంగ్ కు తెలియజేశారు. నవంబర్ లో విశాఖ పట్టణంలో జరుగనున్నభాగస్వామ్య సదస్సుకు హాజరుకావాలని బాబు టీన్ సీ లాంగ్ ను కోరారు.అన్ని రంగాల్లో ఏపీకి చెందిన నిపుణులు ఉన్నారని ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో వీరు సేవలు అందిస్తున్నారని బాబు తెలిపారు.గ్రీన్ ఎనర్జీ,( GREEN ENERGY(గ్రీన్ హైడ్రోజన్,(GREEN HYDROGEN)ట్రాన్సిమిషన్ కారిడార్లు ( TRANSIMISSION C0RRIDAR) పోర్టులు తదితన రంగాల్లో సింగపూర్ కంపెనీల భాస్వామ్యం కావాలని బాబు సింగపూర్ మంత్రి టాన్ సీ లెంగ్ ను కోరారు. ఈ పర్యనలో సీఎం చంద్రబాబుతో పాటు ఏపీ మంత్రులు నారా లోకేష్( NARA LOKESH),నారాయణ(NARAYANA),టీజీ భరత్ ( TG BHARATH) ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు.
………………………………………….