* నారాయణపేట జిల్లాలో దారుణం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : నారాయణ పేట జిల్లాలో దారుణం జరిగింది. మానవత్వం మంటగలిపిన గుర్తుతెలియని ప్రబుద్ధులు అప్పుడే పుట్టిన ఓ ఆడశిశువుని ముళ్లపొదల్లో వదిలేసి వెళ్లిపోయారు. .నారాయణపేట మండలం అప్పక్ పల్లి గ్రామం కాటన్ మిల్ సమీపంలో ముళ్లపొదల్లో వదిలేసి వెళ్లారు. బాటసారులకు పాప ఏడుపు విన్పించడంతో 108 సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న 108 సిబ్బంది పాపకు ప్రథమ చికిత్స చేశారు. స్వల్ప గాయాలతో శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న శిశువునకు 108 సిబ్బంది ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం శిశువును నారాయణపేట జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి వైద్యులు శిశువు ఆరోగ్యం మెరుగ్గా ఉందని తెలిపారు.
…………………………………………..
