
ఆకేరు న్యూస్, ములుగు: ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని ఊరట్టం గ్రామాకమిటి అధ్యక్షులు గజ్జల మహేష్ గత కొన్ని రోజులక్రితం కాలు శస్త్ర చికిత్స చేసుకొని ఇంటీ వద్ద విశ్రాంతి తీసుకుండగా విషయం తెలుసుకున్న *మాజీ జడ్పీ ఛైర్పర్సన్ & ములుగు నియోజకవర్గం ఇంచార్జ్ బడే నాగజ్యోతి ఈరోజు కొత్తూరు లోని వారి స్వగృహనికి వెళ్లి గజ్జెల మహేష్ ను పరామర్శించి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకొని 6000 రూపాయలు ఆర్ధిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో వారి వెంట తాడ్వాయి మండల అధ్యక్షులు దండుగుల మల్లయ్య, మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ దుర్గం రమణయ్య, మాజీ జడ్పీటీసీ రామసహాయం శ్రీనివాస్ రెడ్డి, మాజీ సర్పంచ్ చిడం బాబురావు, సీనియర్ నాయకులు అశోక్ రెడ్డి, నీలం రాములు, ఏడవల్లి మధు, ఎండీ రఫిక్, ఎట్టి జగదీష్, తాడ్వాయి మండల యూత్ అధ్యక్షులు కోట సురేష్, ప్రసాద్ చారీ, మేడారం గ్రామాకమిటి అధ్యక్షులు గజ్జెల సమ్మయ్య, మాజీ వార్డ్ నెంబర్ గజ్జెల రాంబాబు, సమ్మయ్య, యూత్ నాయకులు సంఖ్య ప్రణయ్, మహేందర్, నవీన్, చిడం సాగర్, తదితరులు పాల్గొన్నారు.
…………………………………….