ఆకేరున్యూస్, హైదరాబాద్: కొడంగల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డికి బెయిల్ మంజూరైంది. లగచర్ల ఘటనలో పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి చర్లపల్లి జైలుకు తరలించిన సంగతి తెలిసిందే… ఈ రోజు నాంపల్లి స్పెషల్ కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. నరేందర్ రెడ్డి సహా 24 మంది రైతులకు బెయిల్ లభించింది.
…………………………………