Balakrishna Dada
* నవంబర్ 13న ‘దాదా ధమాకా’ సాంగ్!
* స్టైలిష్ అవతార్‌లో బాలయ్య..
ఆకేరు న్యూస్, సినిమా : నందమూరి బాలకృష్ణ అభిమానులకు పండగ సందర్భంగా చిత్రబృందం ప్రత్యేక ట్రీట్ ఇచ్చింది. బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ ఎంటర్టైనర్ ‘దాదా’ నుంచి దీపావళి స్పెషల్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్లో బాలీవుడ్ నటి నర్గీస్ ఫక్రీ కూడా ఆకట్టుకున్నారు. అంతేకాదు, సినిమా ఫస్ట్ సింగిల్ టైటిల్‌ను ‘దాదా ధమాకా’గా ప్రకటిస్తూ నవంబర్ 13న పాటను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.
* స్టైలిష్ లుక్‌లో బాలయ్య.. గ్లామరస్‌గా నర్గీస్ ఫక్రీ
దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ విడుదల చేసిన ఈ పోస్టర్లో బాలకృష్ణ లెదర్ జాకెట్, సన్‌గ్లాసెస్‌తో స్టైలిష్ అవతార్‌లో కనిపిస్తున్నారు. మరోవైపు నర్గీస్ ఫక్రీ ప్రత్యేకమైన అవుట్‌ఫిట్‌లో గ్లామరస్‌గా మెరిశారు. వెలుగులతో నిండిన గ్రాండ్ బ్యాక్‌డ్రాప్‌లో వీరిద్దరి ఎనర్జిటిక్ లుక్స్ పోస్టర్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా చిత్రబృందం ‘దాదా ధమాకా’ పేరుతో ప్రేక్షకులకు మరో మ్యూజికల్ ట్రీట్ అందించబోతున్నట్లు ప్రకటించింది. ఎస్. తమన్ ఈ పాటకు సంగీతం అందించారు. నవంబర్ 13న విడుదల కానున్న ఈ ఫస్ట్ సింగిల్‌తో సినిమా ప్రమోషన్స్ మరింత ఊపందుకోనున్నాయి.
* బాలయ్య – గోపీచంద్ మలినేని కాంబినేషన్‌పై అంచనాలు
‘దాదా’ చిత్రానికి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘వీరసింహారెడ్డి’ విజయవంతం కావడంతో ఈ సినిమాపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మంచు మనోజ్, కాజల్ అగర్వాల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సాంకేతిక విభాగంలోనూ అనుభవజ్ఞులైన వారు పనిచేస్తున్నారు. అరవింద్ ఎస్. కశ్యప్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, ఏఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైన్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నవీన్ నూలి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. సాయి మాధవ్ బుర్రా సంభాషణలు రాశారు.
రామ్-లక్ష్మణ్, రవివర్మ, వి.వెంకట్ యాక్షన్ సన్నివేశాలను రూపొందిస్తున్నారు. ఎస్.ఎస్.తమన్ సంగీతం అందిస్తున్నారు.
బాలకృష్ణ నటిస్తున్న ఈ మాస్ ఎంటర్టైనర్ను డిసెంబర్ 24న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. నవంబర్ 13న విడుదల కానున్న ‘దాదా ధమాకా’ పాటతో సినిమాపై అంచనాలు మరింత పెరుగుతాయేమో చూడాలి.
Wishing you all a very very Happy Diwali ❤️
#DadaDhamaka will explode and rule your hearts and charts from November 13th 🙂
See you all 🔥
#Dada https://t.co/ddvRTjuYPn— Gopichandh Malineni (@megopichand) November 8, 2026

Please tell us what is wrong. Your report will be sent to the website team.

