
* సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అన్నారు
* నిరుద్యోగ భృతికి రూపాయి కూడా కేటాయించలేదు : జగన్
ఆకేరు న్యూస్, తాడేపల్లి : కూటమి అధికారంలోకి వచ్చాక రెండు బడ్జెట్లు ప్రవేశపెట్టారని, రెండింట్లోనూ ప్రజలను మోసం చేశారని వైసీపీ అధినేత జగన్ (Jagan) చంద్రబాబును విమర్శించారు. గవర్నర్ స్పీచ్(Governor Speech), బడ్జెట్ ప్రసంగంపై జగన్ స్పందించారు. బాబు ష్యూరిటీ మోసం గ్యారెంట అన్నట్లుగా బడ్జెట్ ఉందని ఎద్దేవా చేశారు. ఆత్మస్తుతి – పరనింద అన్నట్లుగా బడ్జెట్ ఉందన్నారు. హామీల గురించి అడిగితే వాళ్ల దగ్గర సమాధానం లేదన్నారు. మొదటి బడ్జెట్ లో హామీలకు కేటాయించింది బోడి సున్నా అని, రెండు బడ్జెట్ లోనూ అరకొర కేటాయింపులే అన్నారు. నిరుద్యోగ భృతి కోసం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని విమర్శించారు. ఇప్పటికే 4 లక్షల మందికి ఉపాధి కల్పించామని, గవర్నర్ ప్రసంగంలోనే చెప్పించారని తెలిపారు. సూపర్ సిక్స్(Super Six), సూపర్ సెవెన్ (Super Seven( అన్నారని, రూ. 3 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారని తెలిపారు. 20 లక్షల మందికి నిరుద్యోగ భృతి కింద రూ. 7,200 కోట్లు ఇవ్వాలన్నారు.
………………………………………