* 1980 సికాస లో ముఖ్య భూమిక
* నల్ల ఆదిరెడ్డితో కలిసి.. బెల్లంపల్లి జైలు
గోడలు బద్దలు కొట్టి తప్పించుకున్న వైనం
* తెలంగాణ రాష్ట్ర కమిటీలో కీలక నేత
*డీజీపీ శివధర్‌రెడ్డి ఎదుట సరెండర్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : మావోలకు వరస షాక్‌లు తగుతున్నాయి. అగ్రనేతల లొంగుబాట్ల పర్వం కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్ర కమిటీలో కీలక నేతగా ఉన్న బండి ప్రకాష్ ఊరఫ్ ప్రభాత్ లొంగిపోయాడు. ఇప్పటికే పార్టీలో కీలకంగా ఉన్న నేతలు అడవీ బాట వీడుతున్నారు. ఈ తరుణంలో రాష్ట్ర డీజీపీ శివధర్‌రెడ్డి ఎదుటు ప్రకాష్ సరెండరయ్యడు.
కోల్‌బెల్ట్ సికాసలో సంచలనం
తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులుగా బండి ప్రకాష్ కొనసాగుతున్నారు. సింగరేణిలో ఉద్యగం చేస్తూనే పీపుల్స్పార్టీలో చేరాడు. చేరిన నుంచే సంచనాలకు మారుపేరుగా నిలిచాడు. 1980 సంవత్సరంలో సింగరేణి కార్మకి సమాఖ్యలో చేరి.. 1988లో బెల్లంపల్లి కమ్యూనిస్టు నేత అబ్రహం హత్య కేసులో జైలుకు వెళ్లాడు. పాత ఆదిలాబాద్ జిల్లా జైలో శిక్షణ అనుభవించాడు. అప్పటి అగ్రనేతలు నల్ల ఆదిరెడ్డి, మహ్మద్ హుస్సెన్, ముంజ రత్నయ్యతో కలిసి జైలు గోడలు బద్దలు కొట్టి తుపాకులతో పరారయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఘటన సంచలనం రేపింది. 1991లో అరెస్టయి.. 2004లో విడుదలయ్యాడు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వంతో జరిపిన శాంతి చర్చల అనంతరం మళ్లీ అడవీ బాట పట్టాడు.
వివిధ స్థాయిలో పని చేసిన ప్రకాష్..
ప్రకాష్ ది మంచిర్యాల జిల్లా మందమర్రి జన్మించాడు. 1980 సంవత్సరంలో మావోయిస్ట్ పార్టీ అనుబంధ సంస్థ సింగరేణి కార్మిక సంఘం అధ్యక్షుడిగా పనిచేశారు. మావోయిస్ట్ పార్టీలో నేషనల్ పార్క్ ఏరియా అత్యంత కీలక ఆర్గనైజర్ పని చేశారు. 45 సంవత్సరాలుగా సీపీఐ మావోయిస్టు పార్టీలో వివిధ స్థాయిలలో రాష్ట్ర కమిటీ సభ్యుడుగా ఉన్న ప్రకాష్ మంగళవారం డీజీపీ ఎదుట లొంగిపోయాడు. ప్రభాత్ పేరుతో ప్రెస్టీంకు ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వహించాడు.
……………………………………………………….
