
* కేంద్ర మంత్రికి కౌశిక్ రెడ్డి కౌంటర్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : కేంద్ర మంత్రి బండి సంజయ్ కాళేశ్వరం మీద మాట్లాడుతుంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తోందని కౌశిక్ రెడ్డి (Koushik reddy) అన్నారు. అసలు బండి సంజయ్ కు ధిమాక్ ఉందా అని ప్రశ్నించారు. “రెండు సార్లు ఎంపీ అయినవ్.. కేంద్ర హోం మంత్రి అయినావ్ రా బాబు నువ్.. ప్రాజెక్టుకు సంబంధించి చిన్న లైన్ కలపలేక పోయావ్.. నువ్వు కాళ్వేశ్వరం గురించి మాట్లాడతావ.. నువ్వు మా హరీశ్‌రావు, కేసీఆర్, కేటీఆర్ గురించి మాట్లాడే స్థాయా నీది..” అని ప్రశ్నించారు. మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడాలని హితవు పలికారు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం ఉందని, కొత్త ఆయకట్టు క్లియర్ చేసింది 5 లక్షల 71 వేలు మాత్రమే అని, కొత్తవి, పాతవి కలిపి 6 లక్షల 64 వేల ఎకరాలు అని చెప్పారు. కాళేశ్వరం కట్టార 48 లక్షల 74 వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చింది కేసీఆర్ అని, ఇది వాస్తవమా, కాదా అని ప్రశ్నించారు. నువ్ బీజేపీ(Bjp) పార్టీవా, కాంగ్రెస్ (Congress) పార్టీవా.., రేవంత్ రెడ్డి (Revanthreddy) చెబితేనే నువ్ పని చేస్తావ్.., అని ఎద్దేవా చేశారు.
…………………………………..