
* వివరాలు వెల్లడించిన పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్
ఆకేరు న్యూస్ హనుమకొండ : నిషేదిత సి.పి.ఐ మావోయిస్టు పార్టీ డివిజన్ కమిటీ కార్యదర్శి,సౌత్ బస్తర్,డివిజనల్ కమిటీ సభ్యుడు, దండాకారుణ్య స్పెషల్ జోనల్ కమిటీ కి చెందిన మంద రూబెన్,@కన్నన్న@మంగన్న@సురేష్(67) వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఎదుట మంగళవారం లొంగిపోయాడు. ఈ లొంగుబాటుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ వివరాలు వెల్లడించారు, హన్మకొండ జిల్లా,హసన్ పర్తి మండలం,వంగపాడు గ్రామానికి చెందిన మంద రూబెన్,@కన్నన్న@మంగన్న@సురేష్ 1979 సంవత్సరంలో కాజీపేటలోని ఆర్. ఈ.సిలో హాస్టల్ మెస్ విభాగంలో పనిచేస్తున్న సమయంలో రాడికల్స్ యూనియన్స్ నిర్వహించే సంస్కృతిక కార్యక్రమాలకు ఆకర్షితుడై మావోయిస్టు పార్టీమాజీ ప్రధాన కార్యదర్శి,ఒక్కప్పటి ఆర్. ఈ.సి పూర్వ విద్యార్థి నంబాల కేశవరావు పిలుపు నందుకొని మావోయిస్టు పార్టీ లో చేరి ఆజ్ఞతంలోని వెళ్ళిపోయాడని కమిషనర్ తెలిపారు.
1981సంవత్సరం నుండి 1986 వరకు నేషనల్ పార్క్ దళ కమాండర్ లంక పాపిరెడ్డి నాయకత్వం దళ సభ్యుడుగా కుంట, బస్టర్ ప్రాంతాల్లో పనిచేసాడని తెలిపారు. 1987లో మావోయిస్టు పార్టీ నాయకత్వం రూబెన్ ను ఏరియా కమిటీ సభ్యుడిగా పనిచేసినట్లు తెలిపారు. 1991లో అనారోగ్యం కారణంగా చికిత్స కోసం కొత్తగుడెం కు వెళుతున్న సమయంలో చత్తీస్గఢ్ పోలీసులు అరెస్ట్ చేసి జగదల్పూర్ జైలు తరలించారు. కాగా ,ఒక సంవత్సరం అనంతరం రూబెన్ మరో ముగ్గురు ఖైదీలతో కలసి జైలు నుండి తప్పించుకున్నాడు. 1992 లో జైలు తప్పించుకున్న రూబెన్ తిరిగి మావోయిస్టు పార్టీ లో కలిసి ఏరియా కమిటీ సభ్యుడిగా కుంట, అబుజ్ మడ్ ప్రాంతాల్లో 1999 వరకు పనిచేసినట్లు కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. . ఇదే సంవత్సరంలో సెంట్రల్ కమిటీ సభ్యుడు రావుల శ్రీనివాస్ @రామన్న గోపన్న నేతృత్వంలో బీజాపూర్ జిల్లా, గుండ్రాయి గ్రామానికి చెందిన పొడియం భీమే తో రూబెన్ కు వివాహం జరిపించారు. 2005 సంవత్సరం డివిజన్ కమిటీ సభ్యుడి పనిచేస్తున్న సమయంలో అనారోగ్యం కారణంగా పార్టీ ఆదేశాలతో రూబెన్ గుండ్రాయి గ్రామంలోనే భార్య, పిల్లలతో నివాసం వుంటూ, కోళ్లు, గొర్రెలు ఫారాలు నిర్వహిస్తూనే స్థానిక గ్రామ కమిటీలతో కలసి చురుకుగా పని చేసే వాడు. ఇదే సమయంలో మావోయిస్టు పార్టీ నాయకులతో పాటు దళ సభ్యులకు షెల్టర్, భోజన వసతులను కల్పిస్తూనే పోలీసుల కదలికలను గమనిస్తూ మావోయిస్టులకు సమాచారం అందించే వాడని తెలిపారు.అనారోగ్యం బాధపడుతున్న రూబెన్, ఉద్యమంలో పాల్గోడంలో శరీరం సహకరించకపొవడం.ముఖ్యంగా మావోయిస్టు సిద్దాంతాలకు కాలం చెల్లిపోవడం, ప్రజలకు మావోయిస్టులపై వ్యతిరేకత రావడంతో పాటు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న పురావాస పథకాల ద్వారా ప్రశాంతవంతమైన వాతావరణంలో తన కుటుంబ సభ్యులతో జీవించాలని, నిర్ణయించుకొని పోలీసుల ఎదుట రూబెన్ లొంగిపోవడం జరిగిందని సీపీ తెలిపారు.
…………………………………………………..